Namaste NRI

ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే అద్భుతమైన కథ

రాజేంద్రప్రసాద్‌, నరసింహరాజు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం అనుకోని ప్రయాణం. వెంకటేష్‌ పెదిరెడ్ల దర్శకత్వంలో డా॥ జగన్‌ మోహన్‌ డీవై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ గ్రాండ్‌ గా జరిగింది.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణానికి ప్రాణమైన ఇద్దరు స్నేహితుల మధ్య నడిచే కథ ఇది. ఒరిస్సా నుంచి రాజమండ్రి వరకు చేసే ప్రయాణం నేపథ్యంలో ఉంటుంది. నా మనసుకు ఎంతగానో నచ్చింది. ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతినందిస్తుంది అన్నారు. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్‌ గారు ప్రేక్షకుల్ని టెన్షన్‌ పెడుతూనే నవ్విస్తారని నిర్మాత జగన్‌ మోహన్‌ తెలిపారు. బెక్కెం వేణుగోపాల్‌ మాట్లాడుతూ అనుకోని ప్రయాణం కథ నచ్చి సినిమా యూనిట్‌ ప్రయాణం మొదలుపెట్టారు. తెలుగు ప్రేక్షకుల కొత్తదనంను ఆదరిస్తారు. ఈ సినిమా కూడా మంచి విజయం అందిస్తారనే నమ్మకం వుందన్నారు. హృదయాన్ని స్పృశించే ఫీల్‌గుడ్‌ మూవీ ఇదని దర్శకుడు వెంకటేష్‌ పెదిరెడ్ల చెప్పారు. ఈ నెల 28న విడుదల కానుంది. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో  పాటు నటుడు సోహెల్‌, దర్శకులు వీరభద్రమ్‌, ఎస్వీ కృష్ణా రెడ్డి, అచ్చి రెడ్డి, విజయ భాస్కర్‌ కె. నందిని రెడ్డి తదితరులు  పాల్గొన్నారు.  ఈ చిత్రానికి కెమెరా: మల్లికార్జున్‌ నరగాని, సంగీతం: ఎస్‌. శివ దినవహి, సంభాషణలు: పరుచూరి బ్రదర్స్‌, సమర్పణ: బెక్కెం వేణుగోపాల్‌, కథ, నిర్మాత: డా॥ జగన్‌మోహన్‌, రచన`దర్శకత్వం: వెంకటేష్‌ పెదిరెడ్ల.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events