Namaste NRI

అమెరికాలో ఆకలితో అలమటిస్తున్న హైదరాబాద్ యువతి

అమెరికా వెళ్లిన తెలంగాణ యువతి అక్కడ రోడ్లపై ఆకలితో అలమటిస్తోంది. హైదరాబాద్ మౌలాలికి చెందిన సయ్యదా లులు మిన్హాజ్ జైదీ అనే యువతి మాస్టర్స్ చేసేందుకు 2021 ఆగస్టులో అమెరికా వెళ్లింది. అక్కడికి వెళ్లిన తర్వాత తరచూ తన తల్లితో ఫోన్ లో మాట్లాడేది. అయితే, రెండు నెలల నుంచి యువతి నుంచి ఎలాంటి ఫోన్ రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమె స్పందన కోసం రోజూ ఎదురు చూస్తూ ఉండేవారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లిన కొందరు జైదీని గుర్తించి, తన పరిస్థితి గురించి హైదరాబాద్ లోని తన తల్లికి సమాచారం అందించారు.

యువతి వస్తువులు ఎవరో దొంగలించారని, దీంతో చికాగో రోడ్ల పై జైదీ ఆకలితో అలమటిస్తున్నట్లు తెలియజేశారు. దీంతో తన కుమార్తె పరిస్థితి తెలుసుకున్న యువతి తల్లి సయ్యదా వహాజ్ ఫాతిమా తన కుమార్తెను తిరిగి భారత్ కు తీసుకురావాల్సిందిగా కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ ను కోరింది. ఈ మేరకు లేఖ రాసింది. ఈ లేఖను తన ట్విట్టర్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events