ఆది సాయికుమార్ హీరోగా జేడీ చక్రవర్తి, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం రుధిరాక్ష హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శివశంకర్ దేవ్ దర్శకత్వం. ఈ చిత్రాన్ని రాజు జువ్వల నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు సముద్రఖని క్లాప్‌నివ్వగా, రామ్ తాళ్లూరి కెమెరా స్విఛాన్ చేశారు. డార్క్ థ్రిల్లర్ కథాంశమిది. ఉన్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించబోతున్నాం. త్వరలో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తాం అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: కిషోర్ బోయిదాపు, సంగీతం: హర్షవర్దన్ రామేశ్వర్, మాటలు: పవన్ హిమాన్షు, బాలు మహేంద్ర, నిర్మాణ సంస్థ: 9స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్, రచన-దర్శకత్వం: శివశంకర్ దేవ్.
