Namaste NRI

మేరీల్యాండ్ గవర్నర్‌ను ఆహ్వానించిన ఆటా ప్రతినిధులు

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ప్రతినిధులు మేరీ ల్యాండ్ రాష్ట్ర గవర్నర్ వెస్ మూర్, లెఫ్టినెంట్ గవర్నర్ అరుణ మిల్లర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. బాల్టిమోర్‌లో నిర్వహించిన ఆటా 19వ మహాసభలకు ఆహ్వానం అందజేశారు. ప్రతినిధి బృందానికి ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా నేతత్వం వహించారు. ప్రతినిధి బృందం లో కాన్ఫరెన్స్ కన్వీనర్ శ్రీధర్ బనాలా, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యుడు రామ్ మట్టపల్లి, కో-ఆర్డినేటర్ జీనత్ కుందూర్ ఉన్నారు.

జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో 3 రోజుల పాటు జరిగే ఆటా 19వ మహాసభల ఏర్పాట్ల గురించి గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఆటా ప్రతినిధులు వివరించారు. మేరీల్యాండ్‌లో తొలిసారిగా నిర్వహించనున్న జాతీయ స్థాయి తెలుగు మహాసభగా గుర్తింపు పొందనుంది. ఈ మహాసభలకు సుమారు 15 వేల మంది హాజరయ్యే అవకాశముందని నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా గవర్నర్ వెస్ మూర్, లెఫ్టినెంట్ గవర్నర్ అరుణ మిల్లర్ ఆటా ప్రతినిధులను అభినందించారు. మహాసభలు విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ శాఖల కార్యదర్శులు, ఇతర ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఈ మహాసభల్లో పాల్గొనే అవకాశముందని సమాచారం.


Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events