అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి ఒకరు మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన బేలమ్ అచ్యుత్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు. బుధవారం జరిగిన బైక్ ప్రమాదంలో ఆయన మృతి చెందాడు. ఆయన మృతికి న్యూయార్క్‌లోని భారత్ కాన్సులేట్ జనరల్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నానని, అచ్యుత్ మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు.