Namaste NRI

అమెరికాలో ప్ర‌మాదం…ముగ్గురు భార‌తీయలు మృతి

అమెరికాలో జ‌రిగిన ఘోర రోడ్డు ప్ర‌మాదంలో గుజ‌రాత్‌కు చెందిన ముగ్గురు మ‌హిళ‌లు మృతిచెందారు. ఆనంద్ జిల్లాకు చెందిన రేఖాబెన్ ప‌టేల్‌, సంగీతబెన్ ప‌టేల్‌, మ‌నీషాబెన్ ప‌టేల్ ఆ ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయారు. ద‌క్షిణ క‌రోలినాలోని గ్రీన్‌విల్లే కౌంటీలో ఆ ముగ్గురు ప్ర‌యాణిస్తున్న వాహ‌నం అదుపు త‌ప్పి ప్ర‌మాదానికి లోనైంది. ఎస్‌యూవీ వాహ‌నం అన్ని లేన్ల‌ను దాటుకుంటూ,  20 ఫీట్ల ఎత్తులో గాలిలోకి వెళ్లింద‌ని, ఆ త‌ర్వాత స‌మీపంలో ఉన్న చెట్ల‌ను ఢీకొన్న‌ట్లు గ్రీన్‌విల్లే కౌంటీ పోలీసులు వెల్ల‌డించారు. వాళ్లు ప్ర‌యాణిస్తు న్న వాహ‌నం అతి వేగంగా వెళ్తున్న‌ట్లు చీఫ్ డిప్యూటీ క‌రోన‌ర్ మైక్ ఎల్లిస్ తెలిపారు. కారును ఓ చెట్టుపై గుర్తిం చామ‌ని, అది ముక్క‌లు ముక్క‌లైంద‌ని పోలీసులు తెలిపారు. ప్ర‌మాదంలో ఒక‌రు మాత్ర‌మే గాయాల‌తో బ‌య‌ట‌ ప‌డి ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. వాహ‌నంలో ఉన్న డిటెక్ష‌న్ సిస్ట‌మ్ వ‌ల్ల ప్ర‌మాదం జ‌రిగిన ప్రాంతాన్ని కుటుంబ స‌భ్యులు గుర్తించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events