కెనడాలో ఓ దోపిడీదారుడిని పోలీసులు చేజ్ చేసే క్రమంలో వాహనాలు ఢీకొని భారత్‌కు చెందిన దంపతు లు, మూడు నెలల వయసున్న వారి మనుమడు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కథనం ప్రకారం టొరంటో కు 50 కిలోమీటర్ల దూరంలోని విట్ బై హైవేలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు అధిక వేగంతో తమ వాహనం నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తున్నది.
ఈ ప్రమాదంలో ఆరుకుపైగా వాహనాలు ఒకదానికి ఒకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో దోపిడీ అనుమానితు డు కూడా అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో మరణించిన భారతీయ దంపతుల పేర్లను పోలీసులు వెల్లడించలేదు. మృతి చెందిన చిన్నారి తల్లిదండ్రులు కూడా ఇదే ప్రమాదంలో గాయపడ్డారు. వారిలో చిన్నారి తల్లి పరిస్థితి విషమంగా ఉంది.