Skip to main content

Namaste NRI

కెనడా లో ప్రమాదం..ముగ్గురు భారతీయుల మృతి

 కెనడాలో ఓ దోపిడీదారుడిని పోలీసులు చేజ్‌ చేసే క్రమంలో వాహనాలు ఢీకొని భారత్‌కు చెందిన దంపతు లు, మూడు నెలల వయసున్న వారి మనుమడు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కథనం ప్రకారం టొరంటో కు 50 కిలోమీటర్ల దూరంలోని విట్‌ బై హైవేలో ఈ ప్రమాదం జరిగింది.  పోలీసులు అధిక వేగంతో తమ వాహనం నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తున్నది.

ఈ ప్రమాదంలో ఆరుకుపైగా వాహనాలు ఒకదానికి ఒకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో దోపిడీ అనుమానితు డు కూడా అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో మరణించిన భారతీయ దంపతుల పేర్లను పోలీసులు వెల్లడించలేదు. మృతి చెందిన చిన్నారి తల్లిదండ్రులు కూడా ఇదే ప్రమాదంలో గాయపడ్డారు. వారిలో చిన్నారి తల్లి పరిస్థితి విషమంగా ఉంది.

Social Share Spread Message

Latest News