ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సలార్. ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో సలార్ రిలీజ్ డేట్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఫిక్షనల్ సిటీ ఖాన్సార్ ప్రాంత నేపథ్యంలో జరిగే ఈ కథలో ఇద్దరు బాల్య స్నేహితులు, పెరిగి పెద్దయిన తర్వాత బద్ధ్ద శత్రువులుగా ఎలా మారారనే వైనాన్ని ఆవిష్కరించారు. అబ్బురపరిచే యాక్షన్ ఘట్టాలు, ఎమోషనల్ డైలాగ్స్, ఎక్స్‌ట్రార్డినరీ మేకింగ్‌తో ట్రైలర్ ఆకట్టుకుంది. రగ్గ్‌డ్ లుక్‌లో ప్రభాస్ పవర్‌ఫుల్‌గా కనిపించారు. ఇప్పటికే విడుదలై ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభిస్తున్నదని, సలార్ ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతినందిస్తుందని నిర్మాత విజయ్ కిరంగదూర్ తెలిపారు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శృతిహాసన్ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురాబోతున్న విషయం తెలిసిందే.
