Namaste NRI

ఆఫ్ఘనిస్తాన్‌ గుడ్‌న్యూస్‌.. మహిళలకు త్వరలోనే

ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళలకు మళ్లీ మంచి రోజులు వచ్చేలా కనిపిస్తున్నాయి. మహిళలకు త్వరలోనే గుడ్‌న్యూస్‌ చెబుతామని  ఆ దేశ అంతర్గత శాఖ తాత్కాలిక మంత్రి, తాలిబన్‌ కో డిప్యూటీ లీడర్‌ సిరాజుద్దీన్‌ హక్కానీ పేర్కొన్నారు. హైస్కూలు చదువులకు అమ్మాయిలను మళ్లీ అనుమతిస్తామని ఆయన తెలిపారు. గతంలోనే వారు ఈ హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు అమలు కాలేదు.  ఇప్పుడు తాజా ప్రకటనతో మహిళల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తమకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన మహిళలు మాత్రం ఇంటికే పరిమితం అవుతారని చెప్పారు. ఆప్ఘనిస్థాన్‌ను ఆక్రమించుకున్న మొదట్లో మహిళలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తామని ప్రకటించిన తాలిబన్లు ఆ తర్వాత వారిపై ఉక్కుపాదం మోపారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా వారు తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.  ఎట్టకేలకు మళ్లీ ఇన్నాళ్లకు తమ నిర్ణయాన్ని మార్చుకున్న తాలిబన్లు అమ్మాయిలు చదువుకునేందుకు అవకాశం ఇస్తామని చెప్పడం శుభపరిణామంగానే భావిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events