ఉగ్రవాద కార్యకలాపాలు జరిపేందుకు ఆఫ్ఘన్ భూభాగాన్ని వినియోగించకుండా చర్యలు చేపట్టాలని భారత్, యూరోపియన్ యూనియర్ (ఈయూ) నిర్ణయించాయి. ఈయూ ప్రత్యేక రాయబారి థామస్ నిక్లాస్సోన్ విదేశాంగశాఖ కార్యదర్శి హర్ష్ శింఘ్లాతో సమావేశమయ్యారు. ఆఫ్ఘన్‌లో ప్రస్తుత పరిస్థితిపై వారిరువురు చర్చలు జరిపారు. ఉగ్రవాదులు ఆఫ్ఘన్ తమ కార్యకలాపాల నిర్వహణకు వేదికగా ఉపయోగించకుండా చేయాల్సిన బాధ్యత తాలిబన్ల ఆధ్వర్యంలో ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వానిదే. అదే టైంలో క్షేత్రస్థాయిలో పరిణామాలను కూడా తాము పరిశీలిస్తామని థామస్ నిక్లాస్సోన్ తెలిపారు.
…………………