
13ఏండ్ల విరామం తర్వాత మెగాఫోన్ పట్టనున్నారు రచయిత, నటుడు తనికెళ్ల భరణి. ఆయన దర్శకత్వంలో వచ్చిన మిథునం సినిమా వాణిజ్యపరంగా విజయాన్ని అందుకోవడమే కాక, విమర్శకుల ప్రశంసలందుకున్నది. పలు అవార్డులను కూడా గెలుచుకున్నది. సుధీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఆయన ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. శ్రీవిశ్వావసు నామ సంవత్సరం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ తన కొత్త సినిమాను ప్రకటించారు తనికెళ్ల భరణి. సినిమాకు కథ ప్రకారం 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసుండే ఎనిమిది మంది యువనటీనటులు అవసరం అనీ, వారికోసం కాస్టింగ్ కాల్ నిర్వహించనున్నట్టు తనికెళ్ల భరణి తెలిపారు.
