Namaste NRI

ఐదేళ్ల తర్వాత మళ్లీ … భారత్‌లోకి టిక్‌ టాక్‌ 

భారతీయ, చైనా సైనిక బలగాల మధ్య గల్వాన్‌ ఘర్షణ తర్వాత భద్రతా కారణాలు చూపుతూ భారత ప్రభుత్వం 2020లో నిషేధించిన చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్‌ యాప్‌ టిక్‌ టాక్‌ ఐదేళ్ల తర్వాత మళ్లీ భారత్‌లోకి ప్రవేశించే అవకాశం కనపడుతోంది. టిక్‌ టాక్‌తోపాటు వందలాది చైనీస్‌ గేమింగ్‌ యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది. ఆ తర్వాత కూడా భారత్‌లో ఏదోవిధంగా కొనసాగేందుకు శాయశక్తులా ప్రయత్నించిన టిక్‌ టాక్‌ కంపెనీ ఎట్టకేలకు 2023 ఫిబ్రవరి 28న మూతపడింది.

అప్పటి నుంచి భారత్‌లో అందుబాటులో లేని టిక్‌ టాక్‌ వెబ్‌సైట్‌ హఠాత్తుగా మళ్ల్లీ  జీవం పోసుకుంది. త్వరలోనే దేశంలో షార్ట్‌ వీడియో షేరింగ్‌ ప్లాట్‌ఫామ్‌ని కంపెనీ తిరిగి ప్రారంభించనున్నట్లు సూచనలు అందుతున్నాయి. ఆన్‌లైన్‌ షాపింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అలీఎక్స్‌ప్రెస్‌, విమెన్‌ క్లోతింగ్‌ ఈకామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ షీన్‌ కూడా రీఎంట్రీ ఇవ్వన్నుట్టు తెలుస్తున్నది. ఈ కంపెనీల వెబ్‌సైట్లు భారత్‌లో తిరిగి ప్రారంభమయ్యాయి. చైనా విదేశాంగ మంత్రి భారత్‌ను సందర్శించి వెళ్లిన కొన్ని రోజులకే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events