Namaste NRI

లవ్‌ మీ కథ విన్నాక.. ఆర్య రోజులు గుర్తొచ్చాయి : దిల్‌ రాజు

ఆశిష్‌, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం లవ్‌మీ. ఇఫ్‌ యూ డేర్‌ ఉపశీర్షిక. అరుణ్‌ భీమవరపు దర్శకుడు. దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ పతాకంపై శిరీష్‌ సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించారు. ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ ఆశిష్‌ ప్రస్తుతం తిరుపతిలో ఉన్న కారణంగా ఈ కార్యక్రమానికి రాలేకపోయాడు. ఈ స్క్రిప్‌ విన్న వెంటనే నేను ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లాను. ఆర్య సినిమా కథలా అనిపించింది.  కథ విని పీసీ శ్రీరామ్‌గారు వెంటనే ఓకే చెప్పారు. కీరవాణిగారు కూడా మ్యూజిక్‌ ఇవ్వడానికి అంగీకరించారు. ఈ కథ గొప్పగా ఉందని చాలా మంది చెప్పారు. ఇదొక న్యూఏజ్‌ ఫిల్మ్‌. ఏప్రిల్‌ 27న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం అన్నారు. ఇలాంటి పాయింట్‌తో ఇప్పటివరకు సినిమా రాలేదని, ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుందని కథానాయిక వైష్ణవి చైతన్య తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: పీసీ శ్రీరామ్‌, సంగీతం: కీరవాణి, దర్శకత్వం: అరుణ్‌ భీమవరపు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events