భారత ప్రధాని మోదీ మరోసారి ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా నిలిచారు. మార్నింగ్ కన్సల్ట్ ఆఫ్ అమెరికా నిర్వహించిన సర్వేలో ప్రధాని మోదీ 69 శాతం ఓట్లతో మొదటి స్థానంలో నిలిచారు. ఈ సంవత్సరం, జూలై 8-14 మధ్య, మార్నింగ్ కన్సల్ట్ సర్వే సంస్థ ప్రతి దేశంలోని ప్రజల నుండి అభిప్రాయాల ను సేకరించిన తర్వాత ఈ జాబితాను విడుదల చేసింది. కాగా, ఈ జాబితాలో మొత్తం 25 మంది నేతలు షార్ట్ లిస్ట్ కాగా, మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రడార్ 63 శాతంతో రెండో స్థానంలో ఉన్నారు. జపాన్ ప్రధాని పుమియో కిషిడా ఈ జాబితాలో అట్టడుగు స్థానంలో ఉన్నారు. అలాగే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బిడెన్‌కు 39 శాతం ఓట్లు వచ్చాయి.
అత్యంత ప్రజాదరణ గల పది మంది గ్లోబల్ నేతల జాబితా …
భారత ప్రధాని నరేంద్ర మోడీ (69 శాతం)
మెక్సికో అధ్యక్షుడు ఆంద్రీ మాన్యూల్ లోపెజ్ ఒబ్రడార్ (63 శాతం)
అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మైలీ (60 శాతం)
స్విట్జర్లాండ్ ఫెడరల్ కౌన్సిలర్ వయోలా ఆమ్‌హెర్డ్ (52 శాతం)
ఐర్లాండ్ నేత సైమన్ హారిస్ (47 శాతం)
యుకె ప్రధాని కైర్ స్టార్మర్ (45 శాతం)
పోలెండ్ అధినేత డొనాల్డ్ టస్క్ (45 శాతం)
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ (42 శాతం)
స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ (40 శాతం)
ఇటలీ ప్రధాని జార్జియా మెలోని (40 శాతం).