వలసదారులకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలతో బ్రిటన్ అట్టుడుకున్నది. బ్రిటన్ దేశానికి చెందిన ముగ్గురు బాలికల మృతికి ఒక వలసదారుడే కారణమని ఆరోపిస్తూ ఇంగ్లండ్, ఉత్తర ఐర్లాండ్‌లో వలసదారుల వ్యతిరేక గ్రూపులు నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారింది. దీంతో పోలీసులు 87 మందికి పైగా ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. గత వారం ఒక డాన్స్ స్కూల్‌లో ముగ్గురు బాలికలను ఒక వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేయడంతో దేశంలోని లివర్‌పూల్, బ్రిస్టల్, హుల్, సోటక్ ఆన్ ట్రెంట్, బ్లాక్‌పూల్ సహా పలు ప్రాంతాల్లో వలస వ్యతిరేక సంస్థలకు చెందిన పలువురు ఆందోళన చేపట్టారు. దుకాణాలు, వ్యాపార సంస్థల లూటీలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో అనుమానితుడు బ్రిటన్ పౌరుడని, వలసదారుడు కాదని పోలీసులు స్పష్టం చేశారు.