
ఆస్ట్రేలియాలో వలసదారులకు వ్యతిరేకంగా, ముఖ్యంగా భారతీయులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా పేరుతో నిర్వహించిన ఆందోళనలో నిరసనకారులు ప్రధానంగా భారతీయులను లక్ష్యంగా చేసుకున్నారు. దేశ సాంస్కృతిక నిర్మాణానికి వారు ముప్పుగా మారారని ఆరోపించారు. పెద్దయెత్తున ఉన్న వలసవాదులకు వ్యతిరేకంగా దేశ రాజధాని సిడ్నీ సహా ప్రధాన నగరాలు, పట్టణాలలో ఆందోళన నిర్వహించారు. 5 నుంచి 8 వేల మంది ఆస్ట్రేలియా జాతీయ జెండాలు ధరించి సిడ్నీలో జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. 100 ఏండ్లలో వచ్చిన గ్రీకులు, ఇటాలియన్ల కంటే, ఐదేండ్లలో వచ్చిన భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉందని వారు ఆరోపించారు.
















