అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ఏజెంట్. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కులు మనాలీలో జరుగుతోంది. స్టైలిష్ స్పై థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం కులు మనాలీలో విజయ్ మాస్టర్ నేతృత్వంలో హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం అని చిత్ర యూనిట్ పేర్కొంది. మనాలీ షూటింగ్ సందర్భంగా చిత్రబృందం దిగిన కొత్త స్టిల్ విడుదల చేశారు. ఈ సినిమా కోసం కొత్తగా మేకోవర్ అయిన అఖిల్ ఆకట్టుకుంటున్నారు. మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 12న విడుదల కానుంది. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: అజయ్ సుంకర, దీపా రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి, సంగీతం: హిప్ హాప్ తమిళ, కెమెరా: రసూల్ ఎల్లోర్, ఎడిటర్ :నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్ : అవినాష్ కొల్ల.
