Namaste NRI

అగ్రరాజ్యంలో ఘోరం… భారతీయ నటుడుపై

అగ్రరాజ్యం అమెరికాలో ఘోరం జరిగింది. భారతీయ నటుడు అమన్ ధలీవాల్‌పై  కత్తితో దాడి జరిగింది. గుర్తు తెలియని దుండగుడు పదునైన ఆయుధంతో విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డాడు. ధలీవాల్ జిమ్‌కు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాలిఫోర్నియాలోని  ప్లానెట్ ఫిట్‌నెస్ జిమ్‌లో జరిగిన ఈ దాడిలో ఆయన శరీరంపై పలు చోట్ల గాయాలయ్యాయి. జిమ్‌ చేస్తున్న ఆయనపై అందరూ చూస్తుండగానే సదరు వ్యక్తి దాడికి పాల్పడడం గమనార్హం. దుండగుడు దాడి అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించగా ధలీవాల్ అతడిని చాకచక్యంగా పట్టుకుని కిందపడేశాడు. అనంతరం జిమ్ సిబ్బంది వచ్చి దుండగుడిని పట్టుకుని బంధించారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు.

ఇక ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ధలీవాల్‌ను జిమ్ సిబ్బంది  చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా, ధలీవాల్‌పై నిందితుడు ఎందుకు దాడిచేశాడన్న విషయంలో స్పష్టత లేదు. ప్రస్తుతం తాను మాట్లాడే పరిస్థితిలో లేనని, కోలుకున్న ఆ తర్వాత అన్ని విషయాలు వివరంగా చెబుతానని నటుడు వెల్లడించాడు. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events