టెక్నాలజీ రంగంలో ఏఐ చాట్ జీపీటీ హాట్‌టాపిక్‌గా మారింది. ఈ చాట్ జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐ ఇప్పుడు మరో సంచలనంతో ముందుకొచ్చింది. మనం టెక్ట్స్ ఇస్తే చాలు నిమిషం వీడియోను రూపొందించే కొత్త మాడల్‌ను రూపొందించింది. దీనికి సోరా అని పేరు పెట్టింది. వినియోగదారుడు ఇచ్చిన ప్రాంప్ట్‌కు అను గుణంగా ఈ మాడల్ నిమిషం వీడియోను రూపొందించి ఇవ్వగలదని ఆ సంస్థ వెల్లడించింది. యూజర్ ఇచ్చిన పదాలను అర్థం చేసుకొని అందుకు అనుగుణంగా కెమెరా మోషన్లతోసహా వివిధ క్యారెక్టర్లను కూడా ఇది రూపొందిస్తుందని తెలిపింది. దీని భద్రత కోసం అనేక చర్యలను తీసుకొంటున్నామని ఓపెన్ ఏఐ తెలిపింది. ఈ సాంకేతికతలో తప్పు దోవ పట్టించే కంటెంట్‌ను గుర్తించే టూల్స్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపింది. సోరా రూపొందించిన పలు వీడియోలను ఓపెన్ ఏఐ ఎక్స్‌లో షేర్ చేయగా, నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తున్నది.