30 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఒరాకిల్ తీసుకొన్న నిర్ణయం టెక్ రంగంలో సంచలనం సృష్టిస్తున్నది. భారత్‌లోనే 12 వేల మంది ఉద్యోగులపై వేటు పడటం ఆందోళన కలిగిస్తున్నది. టెక్ రంగంలో ఈ కోతలు ఒరాకిల్‌కే పరిమితం కాబోవని, రాబోయే రోజుల్లో పలు సంస్థలు లేఆఫ్ బాటపట్టే అవకాశం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కృత్రిమ మేధ (ఏఐ), ఆటోమేషన్ వైపు పలు కంపెనీలు దృష్టిసారించడంతో సంప్రదాయ కోడింగ్ జాబ్స్ మనుగడ ప్రశ్నార్థకమవుతున్నట్టు ఈ సందర్భంగా నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే లేఆఫ్‌లు పెరుగుతున్నట్టు చెప్తున్నారు. ముఖ్యంగా సాస్ (సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్) కంపెనీల్లో ఉద్యోగాలు చేసే వారు ఏఐ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ముఖ్యమని సలహానిస్తున్నారు. మొత్తంగా ఏఐ సెగ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి మరిన్ని గడ్డు పరిస్థితులను తీసుకురావొచ్చని హెచ్చరిస్తున్నారు.















