Namaste NRI

వచ్చే  100 ఏళ్లయినా ఏఐ ఈ పని చేయలేదు: బిల్‌గేట్స్

ప్రపంచ వ్యాప్తంగా  ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ (ఏఐ)‌  వినియోగం భారీగా పెరిగిపోయింది. ఇది మంచి విషయమే అయినప్పటికీ, ఏఐ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగుల్లో అభద్రతా భావం పెరిగిపోయింది. చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటించి,  వారి స్థానాల్లో ఏఐని వినియోగిస్తున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఆందోళనల వేళ మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే 100 ఏళ్లైనా ప్రోగ్రామర్లను ఏఐ భర్తీ చేయలేదన్నారు. అంతేకాదు కోడింగ్‌ పైనా ఏఐ ప్రభావం ఉండదని చెప్పారు.

ఈ సందర్భంగా  బిల్‌గేట్స్‌ మాట్లాడుతూ కృత్రిమ మేధ అనేది ప్రోగ్రామింగ్ రంగంలో మనిషికి ప్రత్యామ్నాయం కాలేదు. కేవలం ఒక సహాయకారిగా మాత్రమే పనిచేస్తుంది. ప్రోగ్రామింగ్‌లో క్లిష్టమైన సమస్యగా భావించేదాన్ని క్రియేటీవ్‌గా పరిష్కరించాల్సి ఉంటుంది. ప్రోగ్రామింగ్‌లో అది సవాలుతో కూడుకున్న విషయం. మానవ మేధస్సు లేని యంత్రాలు (ఏఐ) అలా చేయలేవు  అని బిల్‌గేట్స్‌ వ్యాఖ్యానించారు. అదేవిధంగా కోడింగ్ అంటే కేవలం టైపింగ్‌ చేయడం కాదని,  చాలా లోతుగా ఆలోచించాల్సి ఉంటుందని బిల్‌గేట్స్‌ తెలిపారు. ఈ మేరకు భవిష్యత్తులో కోడింగ్‌, ఎనర్జీ మేనేజ్‌మెంట్‌, బయాలజీ రంగాలకు ఆటోమేషన్‌ ముప్పు తక్కువేనని ఆయన అంచనా వేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events