బాలీవువడ్ స్టార్ హీరోయిన్, అందాల తార ఐశ్వర్యరాయ్ బచ్చన్ మరోసారి ర్యాంప్‌పై దేవతలా మెరిసిపోయింది. పారిస్ ఫ్యాషన్ వీక్‌లో కాస్మెటిక్ బ్రాండ్ లోరియల్ అక్టోబర్ 3న నిర్వహించిన ఈవెంట్‌లో వైట్ కలర్ దుస్తుల్లో ర్యాంప్ వ్యాక్ చేసి అక్కడున్న వారినందరినీ మెస్మరైజ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా విభిన్న సెలబ్రిటీ మహిళలతో ఈఫిల్ టవర్ దగ్గర నిర్వహించిన ఈవెంట్‌లో ఐశ్యర్య రాయ్ సందడి ట్రెండిరగ్‌లో నిలిచింది. మహిళా సాధికారత, వేధింపులకు వ్యతిరేకంగా ప్రచార థీమ్‌తో ఈ వేడుక జరిగినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకకు ఐశ్వర్యతో పాటు అమె భర్త అభిషేక్ బచ్చన్, కూతురు ఆరాధ్య కూడా హాజరయ్యారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)