అద్భుతమైన నటనతో విభిన్నమైన సినిమాలతో తనకుంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఐశ్వర్య రాజేష్. తాజాగా డ్రైవర్ జమున పేరుతో మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఔట్ అండ్ ఔట్ రోడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పా.కిన్స్లిన్ దర్శకత్వం వహిస్తుండగా 18 రీల్స్ ఎస్.పి.చౌదరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇంట్లో వారికి ఇష్టం లేకపోయినా క్యాబ్ డ్రైవింగ్‌ని వృత్తిగా మార్చుకుంటుంది జము. ఒక రైడ్ ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. ఆ రైడ్ ఆమె క్యాబ్‌ల్లో ప్రయాణించే ప్రయాణీకులను నేర నేపథ్యం వుండటం, వారి ప్రాణాలకు ముప్పు ఉన్నందున జమున కూడా ప్రమాదంలో పడటం. చివరికి ఈ ప్రమాదం నుండి జమున ఎలా బయటపడిరది అనేది కథలో కీలకాంశం. ట్రైలర్‌ని బట్టి చూస్తే ఈ చిత్రం సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అనిపిస్తోంది. ఐశ్వర్య రాజేష్ తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటోంది. ఆమె ప్రతి ఒక్క సీన్లో ఎటువంటి డూప్ లేకుండా నటించారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఒకే సమయంలో విడుదల చేయనున్నారు.














