అజయ్ దేవగణ్, టబు జంటగా నటిస్తున్న చిత్రం ఔరోం మే కహా ధమ్ థా? జిమ్మీ షేర్ గిల్. నీరజ్ పాండే దర్శకుడు. సయీ మంజ్రేకర్, శంతను మహేశ్వరి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ లవ్ ఎంటర్ టైనర్ చిత్రీకరణ పూర్తి చేసుకొని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది. ఈ సినిమాని జులై 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్రవర్గాలు ప్రకటించాయి. శీతల్ భాటియా, నరేంద్ర హీరావత్, కుమార్ మంగత్ పాఠక్ నిర్మాంచారు.