అక్కినేని అఖిల్ తన బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన వేడుకలో అఖిల్, జైనాబ్ రవ్దీ లు మూడు ముళ్లతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

ఈ పెళ్లి వేడుకకు చిరంజీవి, రామ్ చరణ్, వెంకటేష్, రానా, ప్రశాంత్ నీల్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు హాజరయ్యారు. జూన్ 8వ తేదీన పెళ్లి రిసెప్షన్ జరగనుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ఇతర రాజకీయ ప్రముఖులు, ఇండస్ట్రీ నుంచి చాలా వరకు హీరోలు, దర్శకులు, నిర్మాతలు, కొందరు హీరోయిన్లు కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.





