Skip to main content

Namaste NRI

నాకంటూ ఓ చరిత్ర ఉంది.. రవితేజ మాస్‌ జాతర టీజర్

రవితేజ నటిస్తున్న కమర్షియల్‌ ఎంటైర్టెనర్‌ మాస్‌ జాతర. శ్రీలీల కథానాయిక. రచయిత భాను భోగవరపు దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. ఇప్పటివరకూ విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయని మేకర్స్‌ చెబుతున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు.

రవితేజ నుంచి ఆడియన్స్‌ ఆశించే అన్ని అంశాలూ మాస్‌ జాతర లో ఉన్నట్టు టీజర్‌ చెబుతున్నది. టీజర్‌లో రవితేజ వింటేజ్‌ ఎనర్జీతో కనిపిస్తున్నారు. రవితేజ శైలి యాక్షన్‌తో నిండిన ఫుల్‌ మీల్స్‌ మాస్‌ ఎంటైర్టెనర్‌ ఇదని, మాస్‌ అంశాలతోపాటు వినోదాన్ని మేళవిస్తూ దర్శకుడు భాను భోగవరపు ఈ సినిమాను మలిచారని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ నెల 27న సినిమా విడుదలకానుంది. ఈ చిత్రానికి మాటలు: నందు సవిరిగాన, కెమెరా: విధు అయ్యన్న, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, సమర్పణ: శ్రీకర స్టూడియోస్‌, నిర్మాణం: సితార ఎంటైర్టెన్మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్‌ సినిమాస్‌.

Social Share Spread Message

Latest News