Skip to main content

Namaste NRI

వినాయ చవితి కానుకగా కన్యాకుమారి

నటి మధుశాలిని సమర్పకురాలిగా రూపొందిన రూరల్‌ లవ్‌స్టోరీ కన్యాకుమారి. అన్‌ ఆర్గానిక్‌ ప్రేమకథ అనేది ఉపశీర్షిక. గీత్‌ సైనీ, శ్రీచరణ్‌ రాచకొండ జంటగా నటించారు. సృజన్‌ అట్టాడ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 27న వినాయచవితి కానుకగా సినిమా విడుదలకానుంది. ఈ సందర్భంగా రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు.

సీతాకోకచిలుక రెక్కలను చేతులకు అలంకరించుకున్న కథానాయికను, ఆమెను ప్రేమగా ఎత్తుకున్న కథానాయకుడ్ని ఈ పోస్టర్‌లో చూడొచ్చు. శ్రీకాకుళం నేపథ్యంలో సాగే ఈ రూరల్‌ ప్రేమకథకు కెమెరా: శివ గాజుల, హరిచరణ్‌.కె, సంగీతం: రవి నిడమర్తి, నిర్మాణం: రాడికల్‌ పిక్చర్స్‌.

Social Share Spread Message

Latest News