Namaste NRI

ప్ర‌పంచ యుద్ధాన్ని నివారించేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు: పుతిన్‌

ప్ర‌పంచ యుద్ధాన్ని నివారించేందుకు ర‌ష్యా అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తుంద‌ని అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్  అన్నారు. విక్ట‌రీ డే మిలిట‌రీ ప‌రేడ్‌లో పాల్గొన్న ఆయ‌న దేశాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించారు. త‌మ దేశం ఎటు వంటి బెదిరింపుల‌ను స‌హించ‌బోద‌న్నారు. ర‌ష్యా మిలిట‌రీ అన్ని వేళ‌లా అప్ర‌మ‌త్తంగా ఉంటుంద‌ని, దేశ సార్వ‌భౌమ‌త్వాన్ని కాపాడేందుకు రెఢీగా ఉన్న‌ట్లు పుతిన్ పేర్కొన్నారు.

రెండో ప్ర‌పంచ యుద్ధ జ్ఞాప‌కాల‌ను ప‌శ్చిమ దేశాలు మ‌రిచిపోవాల‌నుకుంటున్నాయ‌ని, కానీ మాస్కో, లెనిన్‌ గ్రాండ్ వ‌ద్ద జ‌రిగిన యుద్ధాలతో ఎదురైన‌ న‌ష్టాన్ని ఎవ‌రూ మ‌రిచిపోలేర‌న్నారు. ర‌ష్యా ఓ క్లిష్ట‌మైన ద‌శ‌ను ఎదుర్కొంటోంద‌ని, ప్ర‌తి పౌరుడి మీద దేశ భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డి ఉంటుంద‌న్నారు. ప్ర‌త్యేక మిలిట‌రీ ఆప‌రేష‌న్ సంద‌ర్భంగా విక్ట‌రీ డే సంబ‌రాలు జ‌రుపుకుంటున్నామ‌ని, ఫ్రంట్‌లైన్‌లో ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ హీరోలే అని, వాళ్ల పట్టుద‌ల‌, త్యాగం ముందు త‌ల‌వంచుతామ‌ని, ర‌ష్యా మొత్తం మీతోనే ఉంద‌ని పుతిన్ అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events