తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ఓదెల-2. డి.మధు నిర్మించిన ఈ చిత్రానికి అశోక్‌తేజ దర్శకుడు. గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ ఈ సినిమాపై మేము పెట్టుకున్న అంచనాలన్నీ నిజమయ్యాయి. నాగసాధువుగా తమన్నా పర్‌ఫార్మెన్స్ హైలైట్‌గా నిలుస్తుందని ముందే చెప్పాను. ఈ రోజు ఆడియన్స్ కూడా అదే మాట అంటున్నారు. శుక్రవారం నుంచి ఈ సినిమా సునామీ మొదలుకాబోతున్నది. శివశక్తిగా తమన్నా చేసే రచ్చ అప్పుడే ఆరంభమవుతుంది అన్నారు.

ైక్లెమాక్స్‌లో వచ్చే ఎపిసోడ్స్ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయని, ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన సినిమా ఇదని అన్నారు. థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి ఈ సినిమా చూశానని, మహిళలకు ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యిందని, ఆధ్యాత్మికత మూర్తీభవించిన నాగసాధువుగా తమన్నా పాత్ర ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేస్తున్నదని నిర్మాత డి.మధు ఆనందం వ్యక్తం చేశారు. తన కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుందని నటుడు వశిష్ట ఎన్ సింహ తెలిపారు.
