Skip to main content

Namaste NRI

ఈ సినిమాపై మేము పెట్టుకున్న అంచనాలన్నీ నిజమయ్యాయి :  సంపత్‌నంది

తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ఓదెల-2. డి.మధు నిర్మించిన ఈ చిత్రానికి అశోక్‌తేజ దర్శకుడు. గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.  హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా  దర్శకుడు సంపత్‌ నంది మాట్లాడుతూ ఈ సినిమాపై మేము పెట్టుకున్న అంచనాలన్నీ నిజమయ్యాయి. నాగసాధువుగా తమన్నా పర్‌ఫార్మెన్స్‌ హైలైట్‌గా నిలుస్తుందని ముందే చెప్పాను. ఈ రోజు ఆడియన్స్‌ కూడా అదే మాట అంటున్నారు. శుక్రవారం నుంచి ఈ సినిమా సునామీ మొదలుకాబోతున్నది. శివశక్తిగా తమన్నా చేసే రచ్చ అప్పుడే ఆరంభమవుతుంది అన్నారు.   

 ైక్లెమాక్స్‌లో వచ్చే ఎపిసోడ్స్‌ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయని, ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన సినిమా ఇదని అన్నారు. థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి ఈ సినిమా చూశానని, మహిళలకు ఈ సినిమా బాగా కనెక్ట్‌ అయ్యిందని, ఆధ్యాత్మికత మూర్తీభవించిన నాగసాధువుగా తమన్నా పాత్ర ప్రతి ఒక్కరిని మెస్మరైజ్‌ చేస్తున్నదని నిర్మాత డి.మధు ఆనందం వ్యక్తం చేశారు. తన కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుందని నటుడు వశిష్ట ఎన్‌ సింహ తెలిపారు.

Social Share Spread Message

Latest News