నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం నా సామిరంగ. ఆషికా రంగనాథ్ కథానాయిక. విజయ్ బిన్ని దర్శకుడు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. అంజి పాత్రలో అల్లరి నరేష్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. పల్లెటూరి నేపథ్యంలో ఇద్దరి మధ్య స్నేహబంధాన్ని ఆవిష్కరిస్తూ గ్లింప్స్ ఆకట్టుకుంది. సినిమాలో వీరిద్దరి మధ్య అనుబంధం ప్రధానాకర్షణగా నిలుస్తుందని, త్వరలో టీజర్‌ను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కరుణకుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కథ, మాటలు: ప్రసన్నకుమార్ బెజవాడ, దర్శకత్వం: విజయ్ బిన్ని. చాలా కాలం విరామం తర్వాత నాగార్జున నటిస్తున్న పక్కా మాస్ సినిమాగా అభిమానుల్లో అంచనాలు పెంచుతున్నది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)