అల్లరి నరేష్ కథానాయకుడు, దర్శకుడు విజయ్ కనకమేడల కాంబినేషన్‌లో మరో చిత్రం రూపొందనుంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించనున్న ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. కొత్తతరం యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్న చిత్రమిది. విజయ్ కనకమేడల శక్తిమంతమైన, విలక్షణమైన కథని సిద్ధం చేశారు. అల్లరి నరేష్ మరోసారి గాఢతతో కూడిన పాత్రలో కనిపించనున్నారని చిత్ర వర్గాలు స్పష్టం చేశారు. న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్ ఇదని, వినూత్నమైన కథతో తెరకెక్కించబోతున్నామని చిత్ర బృందం పేర్కొంది. నరేష్ ప్రస్తుతం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకంలో చేస్తున్నారు. అది పూర్తయ్యాక కొత్త చిత్రం ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడిరచనున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/40ae94df-5916-473f-9c15-eadaf1b15c93-179x300.jpg)