Namaste NRI

అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్ వచ్చేసింది

అల్లు అర్జున్‌  హీరోగా రూపొందిన చిత్రం పుష్ప 2. సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్‌ పతాకంపై నవీన్‌ యర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. బీహార్‌ రాజధాని పట్నాలో ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఘనంగా జరిగింది. ఈ వేడుకలో భాగంగా పుష్ప 2 ట్రైలర్‌ని కూడా లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ మాట్లాడారు. బీహార్‌ ప్రజలకు నా ప్రణామాలు. ఎక్కడా తగ్గని పుష్పరాజ్‌ మీ ప్రేమకు తలొంచాడు. థ్యాంక్యూ పాట్నా. దేశవ్యాప్తంగా ప్రేక్షకు లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2. ఆ స్థాయిలో ప్రేక్షకులు ఈ సినిమాను సొంతం చేసుకున్నారు. డిసెంబర్‌ 5న సినిమా విడుదల కానుంది. మీ అంచనాలను మించి సినిమా ఉంటుంది అని అన్నారు.

 మీప్రేమను జీవితంలో మరిచిపోలేను. మీ అందరి అంచనాలను మించేలా సినిమా ఉంటుంది. డిసెంబర్‌ 5 కోసం మీలాగే నేనూ ఆతృతగా ఎదురుచూస్తున్నా. ఐలవ్యూ పాట్నా అని కథానాయిక రష్మిక మందన్నా అన్నారు.  ఇక పుష్ప2 ట్రైలర్‌ విషయానికొస్తే ఎవడ్రా వీడు.. డబ్బంటే లెక్కలేదు.. పవర్‌ అంటే భయంలేదు.. అనే జగపతిబాబు డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. ట్రైలర్‌ ఆద్యంతం యాక్షన్‌ మోడ్‌లో సాగింది. డాన్‌గా మారి న పుష్పరాజ్‌ను ఈ ట్రైలర్‌లో చూడొచ్చు. భన్వరాల్‌ షకావత్‌గా ఫహాద్‌ ఫాజిల్‌ పాత్ర అత్యంత శక్తిమంతంగా ట్రైలర్‌లో ఆవిష్కృతమైంది. అంతేకాక, పుష్పరాజ్‌, శ్రీవల్లీల దాంపత్యం నేపథ్యంలో వచ్చే సీన్స్‌ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. మొత్తంగా మాస్‌ ఆడియన్స్‌ మెచ్చేలా ట్రైలర్‌ ఉంది. ఇంకా నిర్మాతలు నవీన్‌ యర్నేని, వై.రవిశంకర్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events