ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. అమెజాన్‌లో పనిచేస్తున్న 10 లక్షల మంది ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం (డబ్యూఎఫ్హెచ్) ఫెసిలిటీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. 2022 జనవరి ప్రారంభం నుంచి కార్పొరేట్ ఉద్యోగులందరినీ కార్యాలయానికి రమ్మని ఆదేశించాలని ప్రణాళికలు రూపొందించలేదని అమెజాన్ డాట్ కామ్ యాజమాన్యం పేర్కొన్నట్లు తెలిసింది. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఫెసిలిటీ కల్పించడంపై తుది నిర్ణయం సంబంధిత విభాగం డైరెక్టర్‌దే తుది నిర్ణయం అని అమెజాన్ సీఈవో ఆండీ జాస్సీ ఉద్యోగులకు పంపిన మెసేజ్‌లో పేర్కొన్నారు. కొన్ని సేవలకు సంబంధించి కస్టమర్ల నిర్ణయాన్ని బట్టి వర్క్ ఫ్రం హోం విధానంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కస్టమర్లకు సేవలందించే విభాగంలో మెజారిటీ ఉద్యోగులు ఆఫీసుకు రావాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)