ఫుల్‌ఫిల్ సెంటర్ల విస్తరణలో భాగంగా ప్రముఖ ఈ`కామర్స్ కంపెనీ అమెజాన్ తెలంగాణ రాష్ట్రంలో మరో ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రాన్ని హైదరాబాద్ సరిహద్దు ప్రాంతంలోని సిద్దిపేట జిల్లా ములుగు మండలం ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే మేడ్చల్‌లో ఉన్న ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్‌ను అదనంగా ఒక లక్ష చదరపు అడుగులతో మొత్తంగా నాలుగు లక్షల చదరపు అడుగులతో స్టోరేజ్ కెపాసిటీని పెంచింది. తాజాగా అమెజాన్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో కంపెనీ ఐదు ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లను కలిగి ఉండనుంది. అంతేకాకుండా రాష్ట్రంలో ఒక మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని కలిగి ఉన్న సంస్థగా అమెజాన్ అవతరించనుంది. రాష్ట్రంలో అమెజాన్ మొత్తం నిల్వ సామర్థ్యం 5 మిలియన్ క్యూబిక్ అడుగులకు చేరనుంది.