Namaste NRI

భారతీయలతో అమెరికా అత్యధిక లబ్ధి : ఎలాన్‌ మస్క్‌

అనేక సంవత్సరాలుగా భారతీయ ప్రతిభావంతులను నియమించుకుంటూ అమెరికా అత్యధిక లబ్ధిని పొందిందని ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ అన్నారు. జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్‌ కామత్‌ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హెచ్‌-1బీ వీసా ప్రోగ్రామ్‌ గతంలో దుర్వినియోగమైనందువల్ల, గత ప్రభుత్వాలు అత్యంత ఉదాసీనంగా వ్యవహరించినందువల్ల అమెరికాలో వలసలకు వ్యతిరేక భావాలు ఉత్పన్నమయ్యాయని తెలిపారు. జో బైడెన్‌ అడ్మినిస్ట్రేషన్‌లో సరిహద్దుల్లో ఎటువంటి నియంత్రణ ఉండేది కాదని, అందరూ స్వేచ్ఛగా అమెరికాకు వచ్చేవారని చెప్పారు. సరిహద్దుల్లో నియంత్రణ లేకపోతే, అది దేశమే కాదన్నారు. బైడెన్‌ అడ్మినిస్ట్రేషన్‌ సమయంలో అక్రమ వలసదారులు పెద్ద ఎత్తున అమెరికాకు వచ్చారన్నారు.

ఇది కొంత వరకు నెగెటివ్‌ సెలక్షన్‌ ఎఫెక్ట్‌ అని తెలిపారు. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రతిభావంతులు అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారనే భావనలో వాస్తవమెంతో కచ్చితంగా చెప్పలేనన్నారు. ప్రతిభావంతుల కొరత ఉందనేది తన ప్రత్యక్ష పరిశీలన అని చెప్పారు. సంక్లిష్టమైన పనులను చేయడానికి ప్రతిభావంతులను నియమించుకోవలసి ఉంటుందని తెలిపారు. స్పేస్‌ ఎక్స్‌, టెస్లా, ఎక్స్‌ వంటి టాప్‌ యూఎస్‌ కంపెనీల చీఫ్‌గా తాను ప్రతిభావంతుల కోసమే చూస్తానని, వారికి సగటు కన్నా ఎక్కువ వేతనాలు చెల్లిస్తానని చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events