వచ్చే ఏడాదిలో చైనాలోని జీబింగ్‌లో జరిగే వింటర్ ఒలిపింక్స్ క్రీడలను దౌత్యపరంగా బహిష్కరిస్తున్నామని వైట్‌హౌస్ ప్రెసె సెక్రెటరీ జెన్ సాకీ ప్రకటించారు. బీజింగ్‌లో జరిగే వింటర్ ఒలిపింక్స్, పారాలింపిక్ క్రీడలకు బైడెన్ పరిపాలన అధికారిక, దౌత్య ప్రతినిధులను ఎవరినీ పంపదని ప్రకటించారు. జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో, చైనాలో మానవహక్కుల ఉల్లంఘనలే కారణమని స్పష్టం చేశారు. అయితే క్రీడల్లో అమెరికా ఆటగాళ్లు పాల్గొనున్నారు. అమెరికా అథ్లెట్లకు పూర్తి మద్దతు ఉంటుందని, తామంతా వారితోనే ఉన్నామని వైట్‌హౌస్ సెక్రెటరీ పేర్కొన్నారు. 2022 ఫిబ్రవరిలో చైనాలో వింటర్ ఒలింపిక్స్ జరుగాల్సి ఉన్నాయి. దౌత్యపరంగా క్రీడలను బహిష్కరించడంపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ అమెరికా తీరుపై విమర్శలు గుప్పించారు.














