పొట్టి ప్రపంచ కప్ 9వ సీజన్‌లో ఆరంభ పోరు అదిరింది. భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికా తొలి మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించింది. మెగా టోర్నీలోనే భారీ లక్ష్యాన్ని ఛేదించిన మూడో జట్టుగా రికార్డు నెలకొల్పింది. తొలుత పొరుగు దేశపు కెనడా జట్టు 190 రన్స్ కొట్టగా, ఆతర్వాత అమెరికా బ్యాటర్లు పూన కాలు వచ్చినట్టు రెచ్చిపోయారు. హిట్టర్ అరోన్ జోన్స్(94 నాటౌట్) అయితే ఏకంగా 10 సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. దాంతో, అమెరికా జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది వరల్డ్ కప్‌లో బోణీ కొట్టింది.

డల్లాస్‌లోని గ్రాండ్ ప్రియరీ స్టేడియంలో బౌండరీల వర్షం కురిసింది. కెనడా, అమెరికా బ్యాటర్లు ఆకాశహే హద్దుగా చెలరేగి అభిమానులకు టీ20 మజాను పంచారు. మొదట ఆడిన కెనడా 20 ఓవర్లో 194 రన్స్ కొట్టింది. నవ్‌నీత్ దలివల్(61), నికోలస్ కిర్టన్(51)లు అర్ధ సెంచరీలతో మెరిసి జట్టుకు భారీ స్కోర్ అందించారు.
