అమెరికా తీసుకున్న తప్పుడు నిర్ణయానికి మూల్యం చెల్లించుకోకతప్పదని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి రaావో లిజియాన్ విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అవాస్తవాలు, అభూతకల్పనలు, అబద్దాల నేపథ్యంలో సైద్దాంతిక పక్షపాత ధోరణితో ఒలింపిక్స్ బహిష్కరణ నిర్ణయం అమెరికా దుర్బుద్ధికి నిదర్శనమని ఆరోపించారు. విశ్వ క్రీడాసంబరమైన ఒలింపిక్స్ రాజకీయా విధానాలకు, రాజకీయ వికారాలకు వేదిక కారాదని అభిప్రాయపడిరది. జిన్ జియాంగ్ ప్రావిన్స్‌తో ఊగర్ ముస్లిం మైనారిటీలపై చైనా దాష్టీకాలకు, ఊచకోతకు పాల్పడుతూండాన్ని ఎత్తిచూపుతా చైనాలో నిర్వహించే శీతాకాల ఒలింపిక్స్‌కు అమెరికా తరపున ఎటువంటి అధికార బృందాన్ని దౌత్యసిబ్బంది పంపేది లేదని అమెరికా తేల్చి చెప్పిన నేపథ్యంలో చైనా తీవ్రంగా స్పందించింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)