
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఇరాన్ తీవ్రంగా స్పందించింది. శాశ్వత అవమానాన్ని, పశ్చాత్తాపాన్ని, లొంగుబాటును అమెరికా చవిచూసేంత వరకు ఈ యుద్ధం కొనసాగుతుందని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ నౌకదాళం, వైమానిక దళం దారుణంగా క్షీణించిపోయాయని, ఆ దేశ నాయకత్వం భారీ నష్టాలను ఎదుర్కొందంటూ ట్రంప్ చేసిన ప్రసంగానికి ఇరాన్ ఈ విధంగా స్పందించింది. ఇరాన్ సైనిక సదుపాయాలను, సామర్థ్యాన్ని దెబ్బతీసినట్లు ట్రంప్ చేసిన ప్రకటనను ఖతమ్ అల్ అన్బియా కేంద్ర ప్రధాన కార్యాలయం అధికార ప్రతినిధి తోసిపుచ్చినట్లు తెలుస్తోంది.















