Namaste NRI

అమెరికా బిలియ‌నీర్ థామస్ లీ ఇక లేరు

అమెరికా బిలియ‌నీర్, లీ ఈక్విటీ వ్య‌వ‌స్థాప‌కుడు థామస్ లీ అనుమానాస్ప‌ద రీతిలో మృతిచెందిన విష‌యం తెలిసిందే. ఆయ‌న త‌న మ‌న్‌హ‌ట్ట‌న్ ఆఫీసులో తుపాకీతో కాల్చుకుని ఆయన చనిపిపోయినట్లు తెలిసింది. 78 ఏళ్ల వ‌య‌సు ఉన్న థామ‌స్ లీ మ‌న్‌హ‌ట్ట‌న్ ఆఫీసులోని ఫిఫ్త్ అవెన్యూలో శ‌వమై తేలారు. ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యంలోనే ఆయ‌న ప్రాణాలు విడిచారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. స్వ‌యంగా తుపాకీతో  కాల్చుకోవ‌డం వ‌ల్లే ఆయ‌న మ‌ర‌ణించిన‌ట్లు తెలిసింది. థామ‌స్ త‌ల‌కు పిస్తోల్ గాయాలు ఉన్న‌ట్లు అనుమానిస్తున్నారు. బిలియ‌నీర్‌ను కాపాడేందుకు సాగిన ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మైన‌ట్లు తెలుస్తోంది. బాత్రూమ్‌  ఫ్లోర్ వ‌ద్ద ఆయ‌న ప‌డి ఉన్న‌ట్లు ఓ మ‌హిళా ప‌నిమ‌నిషి గుర్తించింది.

Social Share Spread Message

Latest News