Namaste NRI

మూడో ప్రపంచ యుద్ధంపై అమెరికా క్లారిటీ

మూడవ ప్రపంచ యుద్ధం చేపట్టాలని ఆసక్తి తమకు లేదని అమెరికా వైట్‌హౌజ్‌ ప్రెస్‌ సెక్రటరీ జెన్‌ సాకీ స్పష్టం చేసింది. నో ఫ్లై జోన్‌ విధించడం అంటే దాన్ని అమలు చేయడమే అని, అంటే రష్యా విమానాలను షూట్‌ చేయడమని, నాటో దళాలు కూడా రష్యా విమానాలను పేల్చాల్సి వస్తుందని, మూడవ ప్రపంచ యుద్దాన్ని ఆరంభించడం తమకు ఇష్టం లేదని జెన్‌ తెలిపారు. ఒకవేళ నో ఫ్లై జోన్‌ విధిస్తే అప్పుడు రష్యాతో యుద్ధం మరింత విస్తృతంగా మారుతుందని అన్నారు. జెలెన్‌స్కీ ఇచ్చిన ప్రసంగాన్ని బైడెన్‌ తన నివాసం నుంచి ప్రత్యక్షంగా చూశారని, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు ప్రసంగం చాలా ఆవేశపూరితంగా, శక్తివంతంగా ఉందన్న అభిప్రాయం కలిగిందన్నారు. కానీ జాతీయ భద్రత దృష్ట్యా తమ ప్రభుత్వం నో ప్లై జోన్‌ పై ఏ నిర్ణయం తీసుకోలేదని ఆమె అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events