అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నత చదువుల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూ స్లాట్లను భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. జూన్, జూలై నెల తొలి పక్షం రోజుల్లో ఎఫ్, ఎం, జే కేటగిరీలకు ఇంటర్వ్యూ తేదీలను ఖరారు చేసింది. అమెరికా వర్సిటీల్లో ఇప్పటికే ప్రవేశాలు పొంది, ఐ`20 పత్రాలు కూడా అందుకున్న భారత విద్యార్థులు అనేక మంది వీసా ఇంటర్వ్యూ స్లాట్ల కోసం ఎదురుచూస్తున్నారు. నిరుడు 62 వేల మందికి స్టూడెంట్ వీసాలు మంజూరు చేయగా, ఈసారి ఎక్కువ వీసాలు ఇవ్వాలని భావిస్తున్నారు. అలాగే స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలో తొలిసారి ఫెయిలైనా మరోసారి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. కొవిడ్ కారణంగా వల్ల నిరుడు జూన్ 14 తర్వాత స్లాట్లను ఓపెన్ చేశారు. అయితే ఈసారి ముందుగానే ప్రకటించడం విశేషం.














