క్వాడ్ దేశాల విద్యార్థులకు అమెరికా ఆఫర్ ప్రకటించింది. ప్రతి ఏడాది వంద మంది విద్యార్థులకు ఫెల్లోషిప్ ఇవ్వనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. క్వాడ్ గ్రూప్‌లో ఉన్న ప్రతి దేశం నుంచి 25 మందికి అవకాశం కల్పించనున్నారు. అమెరికాలో స్టెమ్ గ్రాడ్యుయేట్ యూనివర్సిటీల్లో మాస్టర్స్, డాక్టర్స్ డిగ్రీ చదివేవారికి ఈ ఫెల్లోషిప్ ఇస్తారు. క్వాడ్ గ్రూపులో ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు ఉన్నాయి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/40ae94df-5916-473f-9c15-eadaf1b15c93-179x300.jpg)