అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్‌లు స్వాధీనం చేసుకున్నందున అల్ కాయిదా వంటి టెర్రరిస్ట్ గ్రూపులు రెచ్చిపోయే ప్రమాదం ఉందని, టెర్రరిజంపై పోరాటానికి పాకిస్తాన్ సహకరించాలని అమెరికా స్పష్టం చేసింది. అమెరికా, పాక్ మధ్య పలు సీక్రెట్ డాక్యుమెంట్ల మార్పిడి జరిగిందని, టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాటానికి సహకరించాలని పాక్‌పై అమెరికా ప్రైజర్ చేసిందని తెలిసింది. అఫ్గాన్ నుంచి పారిపోయి వస్తున్న ప్రజలకు సహాయం విషయంలో ఇప్పటికే తాము కీలక పాత్ర పోషిస్తున్నామని పాక్ సమాధానం ఇచ్చినట్లు తెలిపింది. అఫ్గన్ తాలిబాన్‌లతో పాక్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్న విషయాన్ని కూడా అమెరికా ప్రస్తావించినట్లు పేర్కొంది.