Namaste NRI

ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించిన.. అమెరికన్ సింగర్

 భారత ప్రధాని నరేంద్రమోదీని ఆఫ్రికా-అమెరికా సింగర్‌, నటి మేరీ మిల్బన్‌ పొగడ్తల్లో ముంచెత్తారు. ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ జీసస్‌ క్రీస్ట్‌ను పార్థించడాన్ని ఆమె ప్రశంసించారు. మోదీకి క్రిస్మస్‌ పండుగ శుభాకాంక్షలు కూడా తెలి యజేశారు. ప్రధాని మోదీ తాజాగా దేశంలోని క్యాథలిక్‌ చర్చి హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన క్రిస్మస్‌ వేడుకలకు హాజరయ్యారు .దానిపై సింగర్‌ మేరీ మిల్బన్‌ స్పందించారు. మీకు శుభాకాంక్షలు. జీసస్‌ క్రీస్ట్‌ ఒక గొప్ప బహుమతి. ప్రేమకు ఉదాహర ణ. ఇండియన్ బిషప్స్‌ క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌లో మీరు బహిరంగంగా నా రక్షకుడు క్రీస్తును ప్రార్థించినందుకు కృతజ్ఞత లు. వేడుకల్లో మీ మాటలు నా హృదయాన్ని తాకాయి. భారత్‌లోని సోదర, సోదరీమణులందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు అని మేరీ మిల్బన్‌ పేర్కొన్నారు.

కాగా మేరీ మిల్బన్‌ ప్రధాని మోదీని తొలిసారి 2023 జూన్‌లో ఆమెరికాలో కలిశారు. మోదీ అమెరికా పర్యటన సందర్భం గా వాషింగ్టన్‌లోని రొనాల్డ్‌ రీగన్‌ బిల్డింగ్‌లో మేరీ మిల్బన్‌ భారత జాతీయ గీతాన్ని ఆలపించారు.జాతీయ గీతం ఆలాప న అనంతరం మిల్బన్‌ ప్రధాని మోదీ పాదాలను తాకి నమస్కరించారు. ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ చర్య ద్వారా ఆమె ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events