ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించాలన్న అమెరికా వైఖరికి ఇక కాలం చెల్లినట్లేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఆప్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాల నుంచి సైనికాధికారులు హాజరైన ఒక సదస్సును ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఉక్రెయిన్‌కు, రష్యాకు మధ్య వైరం మరింతకాలం కొనసాగాలని అమెరికా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఏకధ్రువ ప్రపంచానికి కాలం చెల్లినట్లేనని తెలిపారు. రస్యా వ్యతిరేక రక్షణ కవచంగా ఉక్రెయిన్ను మార్చాలని అమెరికా ప్రయత్నిస్తుండడం వల్లనే ఆ దేశం లోని తమ సైనిక బలగాలను పంపించాల్సి వచ్చిందని తెలిపారు. వారి ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలంటే ఘర్షణలు కొనసాగుతూ ఉండాలి. అందుకు ఉక్రెయిన్ ప్రజల్ని బలిపశువుల్ని చేశారు అని అమెరికాను ఉద్దేశించి అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/40ae94df-5916-473f-9c15-eadaf1b15c93-179x300.jpg)