అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం వలసదారులకు ఇచ్చే వర్క్ పర్మిట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయులతో పాటు వేలాది మంది ప్రవాసులకు ఊరటనిచ్చేలా గడువు ముగుస్తున్న వర్క్ పర్మిట్ వీసాల వ్యాలిడీటీని 18 నెలల పాటు పొడిగించింది. అయితే, ఇది కొన్ని ప్రత్యేక కేటగిరీల వారికి మాత్రమే వర్తిస్తుంది. గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వారితో పాటు ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ కార్డ్ (ఈఏడీ) కలిగిన హెచ్ 1బీ వీసాదారుల భాగస్వాములకు ఇది వర్తిస్తుందని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది. మే 4 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. ప్రస్తుతం ఈఏడీల గడువు ముగిసిన తర్వాత కూడా 180 రోజులు వరకు వాటిని ఉపయోగించుకునే వీలుంది. అయితే ఇప్పుడు డాన్ని 540 రోజులు (18 నెలల వరకు) ఆటోమేటిక్గా పొడిగిస్తున్నట్లు యూఎస్ఐఎస్సీ వెల్లడిరచింది. అగ్రరాజ్యం తీసుకున్న ఈ కీలక నిర్ణయం వల్ల దాదాపు 87 వేల మంది వలసదారులకు తక్షణమే లబ్ది చేకూరుతుంది.