పాకిస్తాన్లో ఏర్పడిన నూతన ప్రభుత్వంతో తాము కలిసి పనిచేయాలని భావిస్తున్నట్లు అమెరికా కీలక ప్రకటన చేసింది. అంతర్జాతీయ విషయాలతో సహా అన్ని వాటిల్లో కలిసి పని చేయాలని భావిస్తున్నామని అమెరికా ప్రతినిధి నెడ్ ప్రైజ్ కీలక ప్రకటన చేశారు. పాకిస్థాన్‌ను తాము ముఖ్యమైన భాగస్వామిగా చూస్తాం. ఆఫ్గన్ సుస్థిరంగా ఉండడానికి కలిసి పనిచేసే కీలక భాగస్వామిగా మేం పాక్‌ను భావిస్తాం దీని ద్వారా మరింత సురక్షితమైన, మరింత స్థిరమైన మరింత సంపన్నమైన ఆఫ్గన్‌ను నిర్మించడానికి కలిసి పనిచేస్తాం అని నెడ్ ప్రైజ్ ప్రకటించారు.
ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగానే వున్నాయని, ఇలాగే కొనసాగాలని తాము కాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. గత 75 సంవత్సరాలుగా పాక్‌తో సంబంధాలు బాగానే వున్నాయని, కొత్త ప్రభుత్వంతోనూ తాము అలాంటి సంబంధాలనే కొనసాగించాలని భావిస్తున్నామని ప్రకటించారు. ఇప్పటికే నూతన ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు తాము శుభాకాంక్షలు తెలిపామని, ఇక కలిసి నడవమే తరువాయి అని నెడ్ ప్రైజ్ పేర్కొన్నారు.














